Bandi Sanjay: బండి సంజయ్‌ను వెంటనే ఢిల్లీకి రమ్మన్న బీజేపీ అధిష్ఠానం.. ఏం జరుగుతోంది?

అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఢిల్లీకి రావాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.

Bandi Sanjay: బండి సంజయ్‌ను వెంటనే ఢిల్లీకి రమ్మన్న బీజేపీ అధిష్ఠానం.. ఏం జరుగుతోంది?

Bandi Sanjay

Updated On : June 26, 2023 / 8:14 PM IST

Bandi Sanjay – BJP: తెలంగాణలోని దుబ్బాక (Dubbaka), హుజురాబాద్ (Huzurabad)లో గతంలో జరిగిన ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీలో ఇప్పుడు ఉత్సాహం తగ్గిపోయినట్లు కనపడుతోంది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) గెలవడంతో తెలంగాణ నేతలు ఆ పార్టీ వైపుగా చూస్తుండడం, ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ నేతల్లో విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండడంతో కాషాయ పార్టీ అధిష్ఠానం దీనిపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఢిల్లీకి రావాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. బండి సంజయ్ వెంటనే తన కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు. ఇటీవలే బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తమ పార్టీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని చర్చించిన విషయం తెలిసిందే.

మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో బండి సంజయ్‌ను బీజేపీ అధిష్ఠానం పిలవడం ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ప్రధాన పార్టీలన్నీ ఎన్నో వ్యూహాలు రచించుకుంటున్నాయి.

దక్షిణాదిన అధికారంలో ఉన్న కర్ణాటకనూ కోల్పోయిన బీజేపీ తెలంగాణపైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మళ్లుతుండడంతో బండి సంజయ్ కి బీజేపీ అధిష్ఠానం కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

Congress: ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరూ ఆపలేరు.. రాహుల్‌తో మరో సమావేశం ఉంటుంది: కోమటిరెడ్డి, జానారెడ్డి, సీతక్క