YS Sharmila : సీఎం కేసీఆర్ 60లక్షల మంది మహిళలను మోసం చేశారు- వైఎస్ షర్మిల మరో సంచలనం

YS Sharmila : మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను బొంద పెట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. పదేళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు..

YS Sharmila : సీఎం కేసీఆర్ 60లక్షల మంది మహిళలను మోసం చేశారు- వైఎస్ షర్మిల మరో సంచలనం

YS Sharmila

Updated On : July 11, 2023 / 6:04 PM IST

YS Sharmila – CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెలరేగిపోతున్నారు. కేసీఆర్ పాలనపై విరుచుకుపడుతున్నారు. తీవ్ర విమర్శలతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ను ఆయన సర్కార్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల, తాజాగా మరోసారి సంచలన ట్వీట్ చేశారు.

”4 కోట్ల నా తెలంగాణ ప్రజలకు ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి, అధికారమిస్తే.. నట్టేట ముంచడంలో బహుశా ప్రపంచంలోనే కేసీఆర్ నెంబర్.1. ప్రజాక్షేమానికి, దొర చెప్పిన సంక్షేమానికి పొంతనే లేదు. జనాలను గొర్రెలను చేసి, స్కీంల పేరిట బురిడీ కొట్టించి, ఓట్లు దండుకున్నాక అన్ని పథకాలకు పిండం పెట్టిండు. ‘అర చేతిలో వైకుంఠం, ఓట్లు పడ్డాక ఫామ్ హౌజ్ లో ఉంటం’. ఇదే పదేళ్లుగా దొర చేస్తున్న మాయాజాలం. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను బొంద పెట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. 10ఏళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు అమలు చేయని కేసీఆర్ దేశానికి అసలైన దార్శనికుడట.(YS Sharmila)

Also Read..Sircilla Constituency: సిరిసిల్లలో కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు వేస్తున్న ఎత్తులేంటి.. బీజేపీ నుంచి పోటీచేసేదెవరు?

సున్నా వడ్డీ పేరు చెప్పి 60లక్షల మంది మహిళలను మోసం చేశాడు. లక్ష రుణమాఫీ అని చెప్పి 30 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టిండు. కేజీ టు పీజీ అని చెప్పి 2వేల సర్కారీ బడులనే బంద్ పెట్టిండు. పిల్లలకు సన్న బువ్వ అని చెప్పి 22 లక్షల మంది పిల్లలకు ఉన్న బువ్వ లేకుండా చేసిండు. 3వేల నిరుద్యోగ భృతి పేరు చెప్పి 50లక్షల మంది నిరుద్యోగులకు పంగనామాలు పెట్టిండు.

ముష్టి 5వేల రైతు బంధు చూపించి, 35వేల సబ్సిడీ పథకాలను ఆపిండు. 3 ఎకరాల భూపంపిణీ పథకం 30మందికైనా దక్కకుండా 18 లక్షల మంది దళితులను మోసం చేసిండు. ఆత్మగౌరవం పేరు చెప్పి అర లక్ష మందికైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కలే. స్వయం ఉపాధి పథకం ఉపాధిని చూపలే. 10లక్షల మందిలో పట్టుపని 10 వేల మందికి రుణాలు ఇవ్వలే. దళిత బిడ్డలకు దక్కాల్సిన దళితబంధు ఎమ్మెల్యేలకు బంధువైంది.(YS Sharmila)

Also Read..Revanth Reddy : తెలంగాణలో దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు

ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ చేసి కోమాలోకి నెట్టాడు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశాడు. కేసీఆర్ పాలనలో స్కీంలన్నీ స్కాంలే. ప్రజల సొమ్ము దోచుకో.. ఫామ్ హౌజ్ లో దాచుకో.. ఇదే కేసీఆర్ పాలనా సిద్ధాంతం. బంధిపోట్ల రాష్ట్ర సమితి మేనిఫెస్టోకి విలువ లేదు. చేసిన వాగ్దానానికి దిక్కులేదు. ‘మస్త్ చెప్తం తియ్’ ఇదే కేసీఆర్ చెప్పే తల నరుక్కునే మాట” అని షర్మిల ట్వీట్ చేశారు.(YS Sharmila)