CM KCR : నన్ను ఎమ్మెల్యేని, సీఎంను చేసిన గడ్డ గజ్వేల్ : సీఎం కేసీఆర్

తనను ఎమ్మెల్యేను..ముఖ్యమంత్రిని చేసిన గడ్డ గజ్వేల్ గడ్డ అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అని ఆనాటి ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకున్నారు.

CM KCR : నన్ను ఎమ్మెల్యేని, సీఎంను చేసిన గడ్డ గజ్వేల్ : సీఎం కేసీఆర్

CM KCR

CM KCR at Gajwel : ఎన్నికల ప్రచారానికి తెర పడనున్న క్రమంలో గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో పాల్గొన్నారు. తనదైన శైలిలో మాట్లాడుతు గతాన్ని గుర్తు చేసుకున్నారు. తనను ఎమ్మెల్యేను..ముఖ్యమంత్రిని చేసిన గడ్డ గజ్వేల్ గడ్డ అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అని ఆనాటి ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో నాకు ఇది చివరి సభ అని అన్న కేసీఆర్ నేను పాల్గొన్న 96వ సభ అని వెల్లడించారు. గజ్వేల్ అభివృద్దికి ఎంతో కృషి చేశానని ఈ సందర్భంగా తెలిపారు. గజ్వేల్ మీదుగా ట్రిపుల్ ఆర్ రోడ్ వస్తోందని ఇక గజ్వేల్ అభివృద్ధి మరింతగా జరుగుతుందన్నారు.

సీఎం అయిన కేసీఆర్ కు పనీపాటా లేదు..ప్రజలు కట్టిన డబ్బుల్ని రైతు బంధు సాయంతో ఇచ్చి దుబారా చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారని అటువంటివారికి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పై విమర్శలు సంధించారు. రైతు బంధు దుబారా అన్నవారికి బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకునేవారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

అల్లుడికి సిద్దిపేట, కొడుక్కు సిరిసిల్ల పంచిపెట్టిన కేసీఆర్ కామారెడ్డికి ఏదో ప్లాన్ తోనే వచ్చిండు : రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా టీడీపీ పార్టీని స్థాపించిన స్వర్గీయ నేత ఎన్టీఆర్ ను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటోంది..మరి ఇందిరమ్మ రాజ్యం అంత బాగుంటే ఎన్టీఆర్ టీడీపీ ని ఎందుకు పెట్టారు..? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఎమర్జన్సీ వచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఎన్ కౌంటర్లు జరిగాయన్నారు.