Revanth Reddy : అల్లుడికి సిద్దిపేట, కొడుక్కి సిరిసిల్ల పంచిపెట్టిన కేసీఆర్ కామారెడ్డికి ఏదో ప్లాన్ తోనే వచ్చిండు : రేవంత్ రెడ్డి

అల్లుడికి సిద్దిపేట, కొడుక్కు సిరిసిల్ల పంచిపెట్టిన కేసీఆర్ కామారెడ్డికి ఏదో ప్లాన్ తోనే వచ్చిండు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Revanth Reddy : అల్లుడికి సిద్దిపేట, కొడుక్కి సిరిసిల్ల పంచిపెట్టిన కేసీఆర్ కామారెడ్డికి ఏదో ప్లాన్ తోనే వచ్చిండు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Road Show At Kamareddy

Revanth Reddy Road Show : గజ్వేల్ భూములను మింగేసి కేసీఆర్ కామారెడ్డికి ఏదో ఉపాయంతోనే వచ్చిండు అంటూ పీసీసీ చీఫ్, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విమర్శించారు. అల్లుడికి సిద్దిపేట, కొడుక్కి సిరిసిల్ల పంచిపెట్టిన కేసీఆర్ ఇప్పుడు కామారెడ్డిలో పోటీకి దిగారు అంటూ విమర్శించారు. నిజామాబాద్ లో కేసీఆర్ కూతురు కవితను ప్రజలు ఓడగొట్టి ఆవిడ దుకాణం బంద్ చేశారు అంటూ సెటైర్లు వేశారు.

కామారెడ్డిలో రైతుల భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్ ఇక్కడ పోటీకి దిగారు అంటూ ఆరోపించారు. తెలిసి ఎవరైనా పాముకు పాలు పోస్తారా? నమ్మి కేసీఆర్ కు ఓటు వేస్తే… పామును పెంచి పోషించినట్లే అని విమర్శలు సంధించారు. ఇన్నాళ్లుగా గుర్తురాని కొనాపూర్ కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చిందట..? అంటూ ప్రశ్నించారు. పదేళ్లుగా కేసీఆర్ ఇక్కడి ప్రజలకు చేసిందేం లేదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ వస్తుంది రైతు బంధు ఇస్తుందని స్పష్టంచేశారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడగానే.. డిసెంబర్ 10 నుంచి రైతుల ఖాతాలో రైతు బంధు వేసే బాధ్యత మాది అంటూ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని దీంట్లో ఎటువంటి సందేహం లేదని స్పష్టంచేశారు.

Also Read: మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి ముగింపు.. అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఈసీ వార్నింగ్

కాగా, సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆఖరి రోజు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు.దీంట్లో భాగంగా తాను పోటీకి దిగే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రధానంగా బీఆర్ఎస్ పైనే విమర్శలు సంధించారు రేవంత్ రెడ్డి. కాగా, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ పై పోటీకి రేవంత్ రెడ్డి సై అంటూ ఎన్నికల బరిలో నిలిచారు.