Gandhi Bhavan: దిగ్విజయ్ సింగ్ ముందే కుమ్ములాటకు దిగిన కాంగ్రెస్ నేతలు

గాంధీ భవన్‭లో ఎన్ఎస్‭యూఐ విద్యార్థి నేతలతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ తరుణంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎన్ఎస్‭యూఐ నేతలు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్ కుమార్‭పై దాడికి దిగారు. ఈ ఘటనపై దిగ్విజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ..

Gandhi Bhavan: దిగ్విజయ్ సింగ్ ముందే కుమ్ములాటకు దిగిన కాంగ్రెస్ నేతలు

Congress leaders clashed in front of Bhaggumanna Gandhi Bhavan

Updated On : December 22, 2022 / 9:03 PM IST

Gandhi Bhavan: కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్లు, కుమ్మలాటలు తగ్గడం లేదు. ఇవి ఎక్కువై పార్టీ నష్టపోతుందనే అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిగ్విజయ్ సింగ్ ఎదుటే తగువాలటకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‭పై ఎన్ఎస్‭యూఐకి చెందిన ఉస్మానియా విద్యార్థి నేతలు దాడికి పాల్పడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తావా అంటూ బూతులు తిడుతూ కొట్టే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో సేవ్ కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దిగ్విజయ్ ఉన్నది కూడా పట్టించుకోకుండా ఒకరికొకరు గల్లాలు పట్టుకున్నారు.

Maha vs Karnataka: సంజయ్ రౌత్ చైనా ఏజెంట్.. రౌత్ ‘చైనా తరహా’ వ్యాఖ్యలపై భగ్గుమన్న కర్ణాటక సీఎం

గాంధీ భవన్‭లో ఎన్ఎస్‭యూఐ విద్యార్థి నేతలతో అనిల్ కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ తరుణంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎన్ఎస్‭యూఐ నేతలు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్ కుమార్‭పై దాడికి దిగారు. ఈ ఘటనపై దిగ్విజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని విషయాలు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్తామని, ఓయూ విద్యార్థుల అంశాలు పార్టీ దృష్టిలో ఉన్నాయని అన్నారు.