Telugu Film Industry : తెలుగు సినీ ఇండస్ట్రీలో కరోనా భయం..లవ్ స్టోరీ విడుదల వాయిదా, బిగ్ మూవీస్ పరిస్థితి ఏంటీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో కరోనా భయం మొదలైంది. వందల కోట్ల బడ్జెట్.. నాన్‌స్టాప్‌గా భారీ సినిమాల షూటింగ్స్.. పెద్ద పెద్ద మూవీలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న ఇలాంటి టైమ్‌లో.. తెలుగు చిత్ర పరిశ్రమకు వైరస్‌ కంగారు పెట్టిస్తోంది.

Telugu Film Industry : తెలుగు సినీ ఇండస్ట్రీలో కరోనా భయం..లవ్ స్టోరీ విడుదల వాయిదా, బిగ్ మూవీస్ పరిస్థితి ఏంటీ

Telugu Film Industry

Updated On : April 9, 2021 / 7:32 AM IST

Corona second wave : తెలుగు సినీ ఇండస్ట్రీలో కరోనా భయం మొదలైంది. వందల కోట్ల బడ్జెట్.. నాన్‌స్టాప్‌గా భారీ సినిమాల షూటింగ్స్.. పెద్ద పెద్ద మూవీలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న ఇలాంటి టైమ్‌లో.. తెలుగు చిత్ర పరిశ్రమకు వైరస్‌ కంగారు పెట్టిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతుండటం టాలీవుడ్ ప్రొడ్యూసర్లను ఆందోళన గురిచేస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ టైమ్‌లో బిగ్ మూవీస్ పరిస్థితి ఏంటి..? భారీ సినిమాల రిలీజ్‌లు వాయిదా పడతాయా..? ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమాలు సైతం తెరకెక్కవా..? అనే అనుమానాలు టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్నాయి. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాలనిపిస్తోందో అన్న భయం ప్రొడ్యూసర్లను వెంటాడుతోందట. ఇక కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. సినిమాలు రిలీజ్‌ చేస్తే చూసేందుకు ప్రజలు థియేటర్లకు వస్తారా..? పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి వస్తుందా..? అన్న భయంలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

కోవిడ్‌ భయంతో.. సినిమా రిలీజ్‌లను కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్ పడటంతో.. నాగచౌతన్య, సాయిపల్లవి నటించిన లవ్‌ స్టోరీ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈనెల 16న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ఉధృతి కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికి ఇది ఒక్క సినిమానే పోస్ట్‌పోన్‌ అయినా.. ఇలా సినిమాలు మళ్లీ రిలీజ్‌ అవ్వడం వాయిదా పడటం మొదలైతే.. ఫ్యూచర్లో మరోసారి డేట్స్ క్లాష్ అవుతాయని తలలు పట్టుకుంటున్నారు సినిమా జనాలు.

కేసులు ఎక్కువవడంతో షూటింగ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. అసలే పోయిన సంవత్సరం కోవిడ్‌తో ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం సినిమాలను స్పీడ్‌గా.. లేట్ లేకుండా కంప్లీట్ చేసేసి రిలీజ్‌ చేయాలనుకుంటున్న మేకర్స్‌కి కరోనా అడ్డం పడుతోంది. కరోనా టైమ్‌లోనూ సినిమాలను పూర్తి చేసిన.. నిర్మాతలకు ఇప్పుడు రిలీజ్‌ టెన్షన్‌ పట్టుకుంది.

Read More : AP High Court : తగ్గేదే లేదు..కుర్చీలతో కుమ్మేసుకున్న లాయర్లు