నాంపల్లి కోర్టులో కేటీఆర్‌పై వ్యాపారవేత్త క్రిమినల్ పిటిషన్.. కారణం ఏంటంటే..
లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్ రెడ్డి తెలిపారు.

Criminal Petition On Ktr (Photo Credit : Google)
KTR : నాంపల్లి ప్రత్యేక కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ నమోదైంది. వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి క్రిమినల్ పిటిషన్ వేశారు. అమృత్ టెండర్లపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తన పిటిషన్ లో పేర్కొన్నారు సృజన్ రెడ్డి. ప్రజలను తప్పుదారి పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు ఉన్నాయని అన్నారు సృజన్ రెడ్డి. శోధ కన్ స్ట్రక్షన్స్ లో తనకు ఎలాంటి షేర్లు లేకున్నా.. శోధ కన్ స్ట్రక్షన్స్ తో తనకు లింక్ చేస్తూ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై వ్యాపారవేత్త సృజన్ రెడ్డి నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. అమృత్ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. ఈ పిటిషన్ లో మెన్షన్ చేశారు సృజన్ రెడ్డి. దీంతో పాటు శోధ కన్ స్ట్రక్షన్స్ కు సంబంధించిన విషయంలో తనకు వాటాలు ఉన్నాయని కేటీఆర్ ఇటీవల కాలంలో పదే పదే వ్యాఖ్యలు చేశారని, దీనిపై తాను కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపినా.. కేటీఆర్ వ్యవహారశైలి మారలేదని, కాబట్టి కేటీఆర్ పై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు సృజన్ రెడ్డి.
శోధ కన్ స్ట్రక్షన్స్, అమృత్ టెండర్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని సృజన్ రెడ్డి వెల్లడించారు. అసలు టెండర్లు ఏ విధంగా వేస్తారు, ఏ విధంగా దక్కించుకుంటారు.. ఇదంతా కేటీఆర్ కు తెలుసు.. అయినా ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తూ, తన పేరును పదే పదే ఉపయోగిస్తున్నారు కాబట్టి కేటీఆర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు సృజన్ రెడ్డి.
జాయింట్ వెంచర్ కు సంబంధించిన విషయంలో శోధ కన్ స్ట్రక్షన్స్ కు 80శాతం వాటా ఉందని కేటీఆర్ ఆరోపిస్తున్నారని, అందులో నిజం లేదని, కేవలం 29శాతం మాత్రమే వాటా ఉందని సృజన్ రెడ్డి వివరించారు. కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో అంతా పారదర్శకంగా జరిగిందని, కానీ, కేటీఆర్ మాత్రం అవకతవకవలు జరిగాయని నిరాధార ఆరోపణలు చేసినందున, కేటీఆర్ పై క్రిమినల్ చర్యలు తీసుకునేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ తన పిటిషన్ లో సృజన్ రెడ్డి మెన్షన్ చేశారు.
సృజన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు వచ్చే సోమవారం రోజున విచారించనుంది. ఆయన స్టేట్ మెంట్ నమోదు చేయనుంది. ఆ తర్వాత కేటీఆర్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.
Also Read : రాజకీయాల్లో రాములమ్మ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా? ఆమె కాంగ్రెస్ సర్కార్‌లో ఏదైనా పదవిని ఆశిస్తున్నారా?