పొగమంచు: 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం
రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 3 రోజులు వాతావరణం పొడిగా ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో రాత్రి ,ఉదయం సమయాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తుండటంతో చలిగాలుల తీవ్రత అధికంగా ఉండనున్నట్లు వారు చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్ లో 11 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.