IT raids in TPCC Secretary : TPCC సెక్రటరీ అనిరుధ్ రెడ్డి ఇంటిలో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఐటీ అధికారులు TPCC సెక్రటరీ అనిరుధ్ రెడ్డి ఇంటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ రైడ్స్ లో TPCC సెక్రటరీ అనిరుధ్ రెడ్డి పేరు రావటం హాట్ టాపిక్ గా మారింది.

IT raids in TPCC Secretary : TPCC సెక్రటరీ అనిరుధ్ రెడ్డి ఇంటిలో ఐటీ సోదాలు

IT raids at TPCC Secretary Anirudh Reddy's house In Hyderabad

Updated On : January 4, 2023 / 1:28 PM IST

IT raids in TPCC Secretary : హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని పలు చోట్ల 40 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఐటీ అధికారులు TPCC సెక్రటరీ అనిరుధ్ రెడ్డి ఇంటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ రైడ్స్ లో TPCC సెక్రటరీ అనిరుధ్ రెడ్డి పేరు రావటం హాట్ టాపిక్ గా మారింది. అనిరుధ్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గం నమన్వయకర్తగా ఉన్నారు. UWV గ్రానైట్ కు చెందిన డైరెక్టర్లుగా ఉన్న మంజూష గంగాధరం, అనిరుధ్ రెడ్డి మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అనిరుధ్ రెడ్డి కంపెనీ స్ట్రైక్ ఆఫ్ లో ఉంది.

కాగా హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నగరంలోని పలు చోట్ల 40 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఎక్సెల్ టైర్ల కంపెనీతోపాటు ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలోను..బాచుపల్లి, చందానగర్ లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కంపెనీకి చెందిన ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాతున్నాయి. బాచుపల్లిలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఆరు చోట్ల,గచ్చిబౌలిలోని ఎక్సెల్ అడ్మిన్, అకౌంట్ ఆఫీసుల్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చెన్నైలోని హెడ్ క్వార్టర్స్ లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.