బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం.. కొత్త ఇళ్లు

CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులు అందించాలని సూచించారు. సహాయ కార్యక్రమాలకై జీహెచ్ఎంసీకి రూ.5 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.
వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలన్నారు. ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మత్తుల కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు.
తెలంగాణలో ఇప్పటివరకూ 50 మంది వరదల్లో మృతిచెందారని, వారిలో జీహెచ్ఎంసీ పరిధిలో 11 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 101 చెరువులకు కట్టలు తెగిపోయాయని చెప్పారు. 7.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో రూ.2వేల కోట్ల పంట నష్టం వాటిల్లిందని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లకు జరిగిన నష్టం రూ.490 కోట్లుగా కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లోనే 2,540 ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయని చెప్పారు. ముంపు నిబంధనలు పాటిస్తేనే ఇకపై అపార్ట్ మెంట్లకు పర్మిషన్ ఇచ్చేదన్నారు.