కాంగ్రెస్ పాలనలో నల్లా, నాలా నీళ్లు కలిసిపోయేవి : మంత్రి కేటీఆర్

  • Published By: bheemraj ,Published On : November 24, 2020 / 06:09 PM IST
కాంగ్రెస్ పాలనలో నల్లా, నాలా నీళ్లు కలిసిపోయేవి : మంత్రి కేటీఆర్

Updated On : November 24, 2020 / 6:14 PM IST

minister ktr fires congress and bjp : కాంగ్రెస్ పాలనలో నల్లా, నాలా నీళ్లు కలిసిపోయేవని మంత్రి కేటీఆర్ విమర్శించారు. భోలక్ పూర్ లో ఆ నీళ్లు తాగి ఏడుగురు చనిపోయారని తెలిపారు. మంగళవారం (నవంబర్ 24, 2020) ముషీరాబాద్ లో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం మంచి నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.



భవిష్యత్ లో కూడా నీటి కొరత రాకుండా చూసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ లో 100 శాతం పనులు పూర్తి చేశామని మేం చెప్పడం లేదన్నారు. ఒక్కొక్కటిగా అన్నీ మార్చుకుంటూ వస్తున్నామని చెప్పారు.65 ఏళ్ల గబ్బు..ఆరేళ్లలో పోతదా అన్నారు.



6 ఏళ్లలో కేంద్రానికి 2లక్షల 75 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం కట్టిందని గుర్తు చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది లక్షా 40 వేల కోట్లు మాత్రమే అన్నారు. కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలకు వరద సాయం నిధులు ఇచ్చారు కానీ తెలంగాణకు ఇవ్వలేదని విమర్శించారు.