KTR : హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్‌.. ఇష్టారీతిన మాట్లాడారని, సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పీపీ వాదనలు వినిపించారు.

KTR : హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

Updated On : March 19, 2025 / 5:33 PM IST

KTR : మాజీమంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. కేటీఆర్ పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సైఫాబాద్‌ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్‌పై కేసు నమోదైంది. రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

దీనిపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్‌.. ఇష్టారీతిన మాట్లాడారని, సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పీపీ వాదనలు వినిపించారు. రాజకీయ కక్షలతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేసింది.

 

అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న సమయంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో 2020 మార్చిలో రేవంత్ పై కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేసింది హైకోర్టు. ఇక జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ నార్సింగి పోలీసులు రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Also Read : వారికి మూటలు పంపే బడ్జెట్ ఇది: కేటీఆర్, హరీశ్ రావు

ఈ కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. అయితే, తనపై తప్పుడు కేసు పెట్టారని, ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని 2020 మార్చిలోనే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక, ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. నార్సింగ్ పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.