MLAగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2019 / 06:37 AM IST
MLAగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్

Updated On : January 17, 2019 / 6:37 AM IST

తెలంగాణ రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. ఇవాళ(జనవరి17,2019) ఉదయం 11.30గంటలకు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో స్వీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. మొదటిగా సీఎం కేసీఆర్ ప్రమాణం చేశారు. కేసీఆర్ తర్వాత మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.