తెలంగాణలో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

  • Published By: murthy ,Published On : October 27, 2020 / 08:50 AM IST
తెలంగాణలో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Updated On : October 27, 2020 / 10:47 AM IST

telangana  : తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 26,సోమవారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 837 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,32,671కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.


నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,315కి చేరింది. కరోనాబారిన పడి కోలుకున్నవారు నిన్న 1,554 మంది డిశ్చార్జ్ అయ్యారు. తో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,13,466కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,890 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 14,851 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
271020 corona status