High Court Notices : మద్యం దుకాణాల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మద్యం దుకాణాల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

High Court
allocation of liquor shops : తెలంగాణలో మద్యం దుకాణాల రిజర్వేషన్ అంశం హైకోర్టుకు చేరుకుంది. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మద్యం దుకాణాల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మద్యం దుకాణాల విషయంలో రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన కేటాయించారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను సవాల్ చేశారు. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది.
Parking Fee : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అడ్డగోలు దోపిడీ..అరగంటకు పార్కింగ్ ఫీజు రూ.500 వసూలు
ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారో తెలపాలంటూ హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలను సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.