Wall Collapse: భారీ వర్షాలకు గోడ కూలి ఏడుగురు మృతి

ఉత్తర ప్రదేశ్‌లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం ఒక్క రోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు, గోడలు కూలిపోవడంతో వీరంతా మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

Wall Collapse: భారీ వర్షాలకు గోడ కూలి ఏడుగురు మృతి

Wall Collapse: ఉత్తర ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా సంభవిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు బుధవారం ఒక్కరోజే ఏడుగురు మరణించారు. ఈ ఏడుగురు గోడలు కూలడం వల్లే ప్రాణాలు కోల్పోయారు.

Bathukamma: తొమ్మిది రోజులూ.. తొమ్మిది తీర్లు.. ఇదీ బతుకమ్మ సాగే విధానం

చంద్రపుర అనే గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఇంటి గోడ కూలిపోవడంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో నిద్రిస్తున్న పిల్లలు అలాగే ప్రాణాలు విడిచారు. పిల్లల బామ్మ, మరో చిన్నారి గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతులను సింకు (10), అభి (8), ఆర్తి (5), సోను (7)గా గుర్తించారు. మరో ఘటనలో పెట్రోల్ బంకు గోడ కూలిపోవడంతో, ఈ గోడ పక్కనే గుడిసెలో నివసిస్తున్న వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు.

Doctor Revives Newborn Baby: ఊపిరి ఊది చిన్నారి ప్రాణం నిలబెట్టిన డాక్టర్.. వీడియో వైరల్

వీరిని రామే సనేహి (65), రేష్మ దేవి (62)గా గుర్తించారు. మరో ఘటన బంగ్లాన్ అనే గ్రామంలో జరిగింది. జబేర్ సింగ్ అనే 35 ఏళ్ల వ్యక్తి తన ఇల్లు కూలిపోవడంతో, ఇంట్లోనే సమాధయ్యారు. ఈ ఘటనలకు సంబంధించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెప్పారు.