Ambati Rambabu: ఆటలో ఆయన అరటిపండులాంటి వారు: అంబటి రాంబాబు
పవన్ వారాహిని షెడ్డులో పెట్టేశారని అన్నారు. చంద్రబాబు రా కదలి రా అంటుంటే..

Ambati Rambabu
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండులాంటి వారంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు రాజకీయాల్లో ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. ఎన్నికల్లో చూసుకుందాం అంటూ టీడీపీ, జనసేనకు అంబటి రాంబాబు ఛాలెంజ్ విసిరారు.
ఇవాళ అమరావతిలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ వారాహిని షెడ్డులో పెట్టేశారని అన్నారు. చంద్రబాబు రా కదలి రా అంటుంటే ఎవరూ రావడం లేదని చెప్పారు. వైసీపీ సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయని అన్నారు. టీడీపీకి ముందుంది ముసళ్ల పండగ అని చెప్పారు.
కుర్చీలు మడత పెట్టడంలో లోకేశ్‌ది గిన్నిస్ రికార్డ్ అని అన్నారు. టీడీపీ కుర్చీని కూడా లోకేశ్ మడతపెట్టేస్తారని చెప్పారు. 175కి 175కి కొట్టబోతున్నామని తెలిపారు. టీడీపీ మ్యానిఫెస్టో అంటేనే ఓ తెల్లకాగితమని చెప్పారు. జగన్ సిద్ధం సభలతో టీడీపీ భ్రమలు తొలగిపోయాయని తెలిపారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెబితే ఎలా అన్నారు. సవాల్ అంటూ చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్స్ చెబుతున్నారని చెప్పారు.
టీడీపీ కార్యాలయంలో అయినా చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని అన్నారు. తనతో చర్చ జరిగాక చంద్రబాబు బావురుమని ఏడవడం ఖాయమని చెప్పారు. ఇంత వరకూ టీడీపీతో ఎవరికీ పొత్తులూ సెట్ అవ్వలేదు.. సీట్లు పంపకాలు జరగలేదని అన్నారు. ఈ ఎన్నికల తరువాత టీడీపీ గోవిందా అని వ్యాఖ్యానించారు.
Gudivada Amarnath: ‘మరో రెండు రోజుల్లో’ అంటూ పొత్తులపై మంత్రి గుడివాడ కామెంట్స్