Chandrababu Naidu : రైతులకు ఏపీ సర్కారు వెన్నుపోటు

టీడీపీ చీఫ్ చంద్రబాబు రైతులకు అండగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధయ్యారు. ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు..

Chandrababu Naidu : రైతులకు ఏపీ సర్కారు వెన్నుపోటు

Chandrababu Naidu

Updated On : September 13, 2021 / 4:55 PM IST

Chandrababu Naidu : టీడీపీ చీఫ్ చంద్రబాబు రైతులకు అండగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధయ్యారు. ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు టీడీపీ ఆధ్వర్యంలో జోనల్ వారిగా రైతు కోసం పోరుబాట కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ మూతపడిందని, వ్యవసాయం సంక్షోభంలో పడిందని చంద్రబాబు వాపోయారు.

Helmets Safety : హెల్మెట్లు ఇలా ధరిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

రైతులకు జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ‌ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జగన్ మైనార్టీలకు చేసిన ద్రోహం అన్నారు. ఇప్పటికే 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.9వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. కమీషన్ల కోసం అధిక రేట్లకు విద్యుత్ కొని ఆ భారాలు ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మటన్ షాపులు నిర్వహిస్తుందన్న జగన్ వ్యవహారశైలి హాస్యాస్పదంగా మారిందన్నారు.

Inhaled Steroids : కరోనా బాధితులకు ఇన్‌హేలర్‌ స్టెరాయిడ్స్‌..!

వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దోపిడీలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మైనార్టీ, క్రిస్టియన్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎయిడెడ్ కాలేజీల భూములు కాజేయడానికి జగన్ కుట్ర చేశారని ఆరోపించారు. రేషన్, పెన్షన్లను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదల కడుపులు కొడుతోందన్నారు. పంచాయతీల్లో కూడా ఆస్తి పన్ను పెంచేందుకు నిర్ణయించడం జగన్ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. భవిష్యత్ లో గ్రామాల్లో కూడా చెత్త, పారిశుద్ధ్యంపై పన్నువేస్తారని అన్నారు.