Job Notification : విశాఖ,కడప జిల్లాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ విభాగం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Job Notification : విశాఖ,కడప జిల్లాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Jobs

Updated On : August 24, 2021 / 11:50 AM IST

Job Notification : కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 288 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులలో అంగన్ వాడీ కార్యకర్తలు 50 ఖాళీలు, అంగన్ వాడీ సహాయకురాలు ఖాళీలు225, మినీ అంగన్ వాడీ కార్యకర్తలు 13 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతకు సంబంధించి అంగన్‌ వాడీ కార్యకర్త పోస్టులకు పదో తరగతి, అంగన్‌వాడీ సహాయకురాలు, మినీ అంగన్‌ వాడీ కార్యకర్త పోస్టులకు ఏడో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. ధరఖాస్తు దారుల వయస్సు 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం అర్హతతోపాటు, ఓరల్ ఇంటర్వ్యూ ఇతర వివరాలను పరిగణలోకి తీసుకంటారు.

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్త్రీశిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది 31/08/21గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ kadapa.ap.gov.in

విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ విభాగం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ 7ఖాళీలు, కంప్యూటర్ ఆపరేటర్ 5 ఖాళీలు ఉన్నాయి. కొయ్యూరు, ముంచంగిపుట్, పాడేరు, పెదబయలు,డుంబ్రీగూడ,అనకాపల్లి, రావికమతంలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేయాల్సి ఉంటుంది.

కంప్యూటర్ ఆపర్ రేటర్ గా ఎంపికైన వారు భీమునిపట్నం, నర్సీపట్నం,పెందుర్తి, నక్కపల్లి, ఎలమంచిలి ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. విద్యార్హత విషయానికి వస్తే ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధి వయస్సు01.07.2021 నాటికి 21 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం విషయానికి వస్తే నెలకు 15000రూపాయలు చెల్లిస్తారు. కామన్ ప్రొఫిషియన్నీ టెస్ట్ , ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదిని 25.08.2021గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://visakhapatnam.ap.gov.in