తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల తేదీ ఖరారు

తెలంగాణలో 10వ తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. 10వ తరగతి ఫలితాలపై స్పష్టత ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు. మే 13వ తేదీన 10వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో విడుదలైన ఇంటర్ ఫలితాలు వివాదాస్పదం అయిన నేపధ్యంలో 10వ తరగతి ఫలితాల విషయంలో తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆచితూచి అడుగులు వేసింది. పక్కాగా ఎటువంటి తప్పులు లేవని నిర్ణయించుకున్న తర్వాతే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.
10వ తరగతి గణితం ప్రశ్నాపత్రంలో తప్పులో దొర్లగా.. ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు 6 మార్కులు కలపాలని నిర్ణయించారు అధికారులు. సోమవారం(మే 13) ఉదయం 11:30కి ఫలితాలు విడుదల కానున్నాయి. సచివాలయంలోని డీ-బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యాశాఖ అధికారులు ఫలితాలను విడుదల చేయనున్నారు. bsetelangana.org, results.cgg.gov.in వెబ్‌సైట్లలో 10వ తరగతి ఫలితాలను చూసుకోవచ్చు విద్యార్ధులు.