అందరూ కరోనా పేషెంట్లులా ప్రవర్తించండి: న్యూజిలాండ్ ప్రధాని

అందరూ కరోనా పేషెంట్లులా ప్రవర్తించండి: న్యూజిలాండ్ ప్రధాని

Updated On : March 25, 2020 / 5:37 AM IST

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాసిండా ఆర్డెర్న్ ప్రజలను కరోనా పేషెంట్లులా ప్రవర్తించాలంటూ సూచనలిచ్చారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఒకరి నుంచి వేరొకరికి ఫిజికల్ కాంటాక్ట్ అస్సలు ఉండకూడదని హెచ్చరించారు. ప్రభుత్వం నెలరోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ప్రజలంతా అలర్ట్ అవ్వాలని కోరారు. కొవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎమర్జెన్సీ ప్రకటించేశారు. 

దేశవ్యాప్తంగా 50కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లిపోవాలి. అత్యవసరం కాని ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. స్కూళ్లు, ఆఫీసులు అర్ధరాత్రి నుంచి మూసేస్తారు. ‘నేటి అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ జరుగుతుంది. వైరస్ వ్యాప్తిని ఆపే ప్రయత్నమే ఇది. చైన్ ను ఇక్కడితో కట్టడి చేద్దామనుకుంటున్నాం. ఏ తప్పూ చేయకుండా ఉంటేనే పరిస్థితి దారుణం అవకుండా ఉంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది. దీని మూలన వచ్చే వారానికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కరోనాను తరిమికొట్టడంలో సక్సెస్ అయ్యేందుకు ఇప్పటి నుంచే కష్టపడాలి’ అని ప్రధాని సూచించారు. 

ఈ లాక్ డౌన్ ప్రకటించే ముందు న్యూజిలాండ్ లో వేల కొలది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రసంగం ముగించిన తర్వాత ప్రధాని ఇలా అన్నారు. ‘మీకేమైనా సందేహాలున్నాయా. మనం ఏం చేయగలమో.. చేయలేమోనని. ఒక్కటే సిద్ధాంతం. ప్రతి ఒక్కరు మీకు కరోనా వైరస్ సోకిందనుకోండి. ఇతరులకు సోకకుండా ఉండాలని దూరం పాటించండి’ అని అన్నారు. 

మీరు తీసుకునే ప్రతి స్టెప్ అందరి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అంతా కలిసి ఒకటిగా ఆలోచించాలి. లాక్ డౌన్ ప్రకటించామని ఈ సమయంలో కుటుంబాన్ని, మనవళ్లను, స్నేహితులను, ఇరుగుపొరుగువారిని కలవాలని వెళ్లకండి. ఎందుకంటే ఒకరికొకరు దూరంగా ఉండటమే ఉత్తమం. దేశాన్ని కాపాడుకోవాలంటే ఇది తప్పనిసరి’ అని ప్రధాని పేర్కొన్నారు. 5మిలియన్ మంది ప్రజలు ఉన్న న్యూజిలాండ్ తో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా.. వేల మంది ప్రాణాలను బలిగొంటుంది. 

Also Read | కొత్తగూడెం డీఎస్పీ వంట మనిషికి కరోనా..ఈమె ద్వారా ?