చల్లగాలి కోసం : ఫ్లైట్ విండో ఓపెన్..విమానం ఆలస్యం

తెలిసో తెలియక ప్రయాణికులు చేసే పనులు ఒక్కోసారి విమాన సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతుంటాయి. ఫలితంగా విమానం ఆలస్యం కావడమో.. లేదా రద్దవడమో జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి కూడా. ఒకరు విమానం వెళుతుండగానే..చేయని పనులు చేయడం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే చైనాలో చేసుకుంది.
చైనాలోని గాన్సు నుంచి హుబే ప్రావిన్సులోని వుహాన్‌కు షియామెన్ ఎయిర్ జెట్ విమానం వెళ్లడానికి సిద్ధంగా ఉంది. టేకాఫ్ కావడానికి సిద్ధంగా అవుతోంది.
ఈ లోపు విమానంలో కూర్చున్న ఓ మహిళ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటీకిని తెరిచింది. దీంతో విమానం స్టార్ట్ కాలేదు. అసలు విమానం ఎందుకు స్టార్ట్ కావడం లేదా అని పైలెట్లు, సిబ్బంది ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడు అసలు విషయం తెలిసిందే. ఓ మహిళ ఎమర్జెన్సీ కిటీకి తెరిచినట్లు గుర్తించారు. ఆమె వద్దకు వెళ్లి కిటీకి ఎందుకు తెరిచారు అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానంతో సిబ్బంది నోరెళ్లబెట్టారు.
ఉక్కపోతగా ఉందని, గాలికోసం కిటికీని తెరిచినట్లు తాపీగా చెప్పింది. అక్కడే ఉన్న పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. వీరు విమానంలో తనిఖీలు చేశారు. ఆమె చేసిన పనికి గంట ఆలస్యంగా విమానం బయలుదేరింది. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read More : పాముతో పరాచకాలా : యువకుడి నుదిటిని పట్టి పీకేసింది!
— UK Travel-Jinx (@uktraveljinx) September 26, 2019