wedding of the century : ఆ జంట పెళ్లి ఖర్చు రూ.491 కోట్లు.. ఈ శతాబ్దంలోనే ఖరీదైన పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా?

ఓ సంపన్నుల ఇంట్లో జరిగిన పెళ్లి వేడుక ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ శతాబ్దంలోనే జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిగా చెబుతున్నారు. ఈ పెళ్లి ఎక్కడ జరిగిందంటే?

wedding of the century : ఆ జంట పెళ్లి ఖర్చు రూ.491 కోట్లు.. ఈ శతాబ్దంలోనే ఖరీదైన పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా?

wedding of the century

Updated On : November 28, 2023 / 2:16 PM IST

wedding of the century : ఇటీవల కాలంలో సంపన్న కుటుంబాలు తమ పెళ్లి వేడుకల్లో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం పరిపాటిగా మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా జోరందుకున్నాయి. బయటకు తెలియని ఓ ఖరీదైన పెళ్లి వేడుక గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ శతాబ్దంలోనే అంత రిచ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరగలేదని చెబుతున్నారు. ఆ పెళ్లి ఎవరిది? ఆ పెళ్లి విశేషాలు ఏంటి?

ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల జంటలు ఒక్కటవుతున్నాయి. సంపన్నుల ఇళ్లలో ఈ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. జీవితకాలం మర్చిపోలేని విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఉంటే పారిస్‌లో ఓ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. అంతేకాదు ఈ శతాబ్దంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి వేడుకగా చెబుతున్నారు. 26 సంవత్సరాల మడేలైన్ బ్రాక్‌వే, జాకబ్ లాగ్రోన్ జంట నవంబర్ 18 న పెళ్లి చేసుకున్నారు. మడేలైన్ బ్రాక్‌వే కుటుంబం అత్యంత సంపన్నులు కాగా వారి కుటుంబం కార్ డీలర్ షిప్ నడుపుతోంది. వారం రోజులపాటు జరిగిన వీరి వివాహ వేడుకల ఖర్చు $59 మిలియ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.491 కోట్లు) గా చెబుతున్నారు.

Also Read : ఇదేం వెడ్డింగ్ కార్డురా నాయనా.. పెళ్లికి వెళ్లాలంటే రీసెర్చ్ చేయాల్సిందే!

మడేలైన్ బ్రాక్‌వే , జాకబ్ లాగ్రోన్ జంట వివాహ వేడుకలు ప్రసిద్ధ ప్యాలెస్‌లో జరిగాయి. ప్రైవేట్ జెట్ విమానాల్లో అతిథులను పారిస్‌కు తీసుకురావడం, హిట్ బ్యాండ్ మెరూనే 5 సంగీత కచేరి ఇలా ఈ వేడుకలో అత్యంత ఖరీదైన వినూత్నమైన సంబరాలు జరిగాయి. అంతేకాదు ప్యాలెస్ లోపల, బయట భారీ పూల డెకరేషన్ ఆకట్టుకుంది. వధువు మడేలైన్ బ్రాక్‌వే తండ్రి రాబర్ట్ బ్రాబ్ బిల్ ‘ఉస్సేరి మోటార్స్‌’ లో చైర్మన్, సీఈఓగా ఉన్నారు. ఇతని కంపెనీ కోరల్ గేబుల్స్, కట్లర్ బే మరియు ఫ్లోరిడాలోని మెర్సిడెస్-బెంజ్ డీలర్ షిప్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పెళ్లి వేడుక ఖర్చులపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మడేలైన్ బ్రాక్‌వే , జాకబ్ లాగ్రోన్ వివాహ వేడుక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమం..! బూమ్రా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఎవరిని ఉద్దేశించి..? హార్దిక్ గురించేనా ..

 

View this post on Instagram

 

A post shared by The Lake Como Wedding Planner (@lakecomoweddings)