ఏపీలో మళ్లీ తగ్గిన మద్యం ధరలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 29, 2020 / 07:06 PM IST
ఏపీలో మళ్లీ తగ్గిన మద్యం ధరలు

Updated On : October 29, 2020 / 7:22 PM IST

Andhra Pradesh Govt Reduces Liquor Price ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మద్యం ధరలు తగ్గాయి. కొన్ని రోజుల క్రితం లిక్కర్ ధరలను తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లిక్కర్ రేట్లను సవరించింది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగింది. దీంతో మద్యం ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.



గతంలో చీప్ లిక్కర్ రేట్లు తగ్గించిన ఏపీ ఎక్సైజ్ శాఖ… ఇప్పుడు మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు 25శాతం తగ్గించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. రూ. 250-300 వరకు ఉన్న మద్యం బాటిల్ పై ధరను రూ. 50 తగ్గించింది. భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యంతో పాటు, విదేశీ లిక్కర్ ధరలను కూడా ప్రభుత్వం తగ్గించింది.



రూ. 50 నుండి రూ. 1350 వరకు వివిధ కేటగిరిల్లో మద్యం ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బీరు, రెడీ టూ డ్రింక్ మ‌ద్యం ధ‌ర‌ల్లో మాత్రం ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు.