ప్రధాని దీపాలు పెట్టమంటే.. గాల్లో కాల్పులు జరిపిన BJP లీడర్

ప్రధాని దీపాలు పెట్టమంటే.. గాల్లో కాల్పులు జరిపిన BJP లీడర్

Updated On : April 6, 2020 / 11:12 AM IST

భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై అనూహ్య స్పందన వచ్చింది. వీరందరికీ భిన్నంగా ఆలోచించారు ఉత్తరప్రదేశ్ బీజేపీ లీడర్ మంజూ తివారీ. 

ఈమె చూపించిన అత్యుత్సాహానికి ఉత్తరప్రదేశ్ పోలీస్ ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె చేసిన తప్పును ఆమే #9pm9minute అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా పోస్టు చేసుకుని బుక్కయింది. ఆమె గాల్లోకి కాల్పులు జరుపుతుంటే సపోర్ట్ చేస్తూ భర్తే వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ‘దీపాలు వెలిగించాం. ఇప్పుడు కరోనాను తరుముతున్నాం’ అంటూ కామెంట్ కూడా రాశారు. 

విమర్శలు ఎక్కువగా వస్తుండటంతో తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది. ఆమె దీనిని దీపావళిలా భావించినట్లు చెప్పింది. ‘నేను సిటీ మొత్తం దీపాలు, కొవ్వొత్తులతో వెలిగిపోతుండటం చూశాం. దీనిని దీపావళిలాగే అనుకున్నా. నా తప్పును ఒప్పుకుని క్షమాపణలు అడుగుతున్నా’ అంటూ మీడియాకు చెప్పుకుంది. 

బలరామ్ పూర్ కు చెందిన మిస్సెస్ తివారీ అక్కడ బీజేపీ మహిళా విభాగానికి నాయకురాలిగా పనిచేస్తుంది. ఈ ఘటనపై యూపీ కాంగ్రెస్ రెస్పాండ్ అయింది. బీజేపీ నాయకులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రధాని దీపాలు వెలిగించమంటే బీజేపీ నాయకులు గాల్లో కాల్పులు జరిపి వీడియో ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్నారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ తీసుకుంటారా.. లేదా?అని పోస్టు చేశారు. 

See Also | ముస్లిం గర్భిణీని హాస్పిటల్లో చేర్చుకోవడానికి నిరాకరించిన డాక్టర్, శిశువు మృతి