Corona Cases : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే?
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,503 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

Corona Cases (3)
Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,503 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. మరో 624 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,74,744చేరింది.
చదవండి : AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
అలాగే మరణాల సంఖ్య 4,74,735కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 94,943 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఆరోగ్యశాఖ. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా కొనసాగుతుంది.. ఇప్పటి వరకు 1,31,18,87,257 మందికి పైగా టీకా తీసుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇక ఒమిక్రాన్ కేసులు 24గా ఉన్నాయి. ఈ వేరియంట్ బారినపడిన ఓ వ్యక్తి కోలుకొని ఇంటికి వెళ్లారు.
చదవండి : Telangna Corona Cases : తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసులు