Lok Sabha Elections 2024: మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన?

గత లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగానే మ్యాజిక్‌ ఫిగర్‌ స్థాయి సీట్లు బీజేపీకి దక్కాయి. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడంతో..

Lok Sabha Elections 2024: మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన?

Election Commission

Updated On : February 23, 2024 / 4:51 PM IST

కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల సంసిద్ధతపై ఎన్నికల కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని ఎన్నికల సంఘం వర్గాలు చెప్పాయి. ఆ పని పూర్తయిన తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తమిళనాడులో పర్యటిస్తున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తారు. వచ్చే నెల 13లోపు పర్యటనలు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటిస్తారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగానే మ్యాజిక్‌ ఫిగర్‌ స్థాయి సీట్లు బీజేపీకి దక్కాయి. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడంతో ఎన్డీయేను మరింత బలోపేతం చేయాలన్న నిశ్చయానికి బీజేపీ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు పార్టీలను ఎన్డీయేలోకి ఆహ్వానించింది.

ఇండియా కూటమిలో వచ్చిన విభేదాలు కాంగ్రెస్ కి తలనొప్పిగా మారాయి. జేడీయూ సహా పలు పార్టీలు ఆ కూటమికి షాక్ ఇచ్చాయి. ఎన్డీయేను ఓడించాలంటే బలమైన విపక్ష కూటమి అవసరం. ఎన్నికలకు మరికొన్ని వారాలే సమయం ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి.

షర్మిల అరెస్ట్ విషయం నాకు తెలియదు.. సంక్రాంతి వేళ వేషాలు వేసుకొస్తారు.. అలాగే ఇప్పుడు ఎన్నికలు..: బొత్స