Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం.. నాతోసహా అందరూ ఆయనకే రిపోర్ట్ చేయాలి ..

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. పార్టీ నాయకులంతా ఆయనకే రిపోర్ట్ చేయాలని, నాతోసహా. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో వారే నిర్ణయిస్తారంటూ రాహుల్ పేర్కొన్నాడు.

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం.. నాతోసహా అందరూ ఆయనకే రిపోర్ట్ చేయాలి ..

Rahul Gandhi

Updated On : October 19, 2022 / 2:46 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే నడవాల్సి ఉంటుందని కొందరు చేస్తున్న ఆరోపణలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం అని కుండబద్దలు కొట్టాడు. పార్టీ నాయకులంతా ఆయనకే రిపోర్ట్ చేయాలని, నాతోసహా. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో వాళ్లే నిర్ణయిస్తారంటూ రాహుల్ పేర్కొన్నాడు. భారత్ జోడో యాత్రలోభాగంగా ఏపీలోని కర్నూల్ జిల్లాలో రెండో రోజు బుధవారం యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ అనుభవజ్ఞులేనని తెలిపారు. ఖర్గే విజయం పట్ల రాహుల్ భినందనలు తెలిపారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ తప్పకుండా బలోపేతం అవుతుందన్నారు. తామందరం కాంగ్రెస్‌ వాదులమే అని అన్నారు.

New Congress President: 7,897 ఓట్లతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గెలుపు 

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో అవకవతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై రాహుల్‌ స్పందించారు. దేశంలో ఏ పార్టీకిలేని విధంగా కాంగ్రెస్‌ సీఈసీ ఉందని రాహుల్ అన్నారు. ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు. శశిథరూర్‌ వర్గం చేసిన ఫిర్యాదుపై మిస్త్రీ తప్పకుండా విచారణ జరుపుతారని రాహుల్ తెలిపారు. భారత్ జోడో యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని రాహుల్ అన్నారు. దేశంలో కొన్ని శక్తులు ద్వేషం, హింసను పెంచుతున్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయన్నారు. ప్రధాన మంత్రి ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టడం ఎప్పుడైనా చూశారా? అని రాహుల్ ప్రశ్నించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే వైసీపీ మద్దతు తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా.. రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయం, పార్టీకి సంబంధించిన ఏ విషయం ఉన్నా పార్టీ అధ్యక్షుడే నిర్ణయం తీసుకుంటారని రాహుల్ చెప్పారు.