కాన్షీరామ్ ని మాయావతే చంపిందా! :యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 29, 2019 / 09:30 AM IST
కాన్షీరామ్ ని మాయావతే చంపిందా! :యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Updated On : August 29, 2019 / 9:30 AM IST

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP)వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ది సహజమరణం కాదంటూ, అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయాడంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి కనుసైగల్లోనే కాన్షీరామ్ ట్రీట్మెంట్ కొనసాగిందని ఆయన అన్నారు. యామావతి.. కాన్షీరామ్ ని హత్య చేసిందని ఆయన సోదరి చెబుతుందని గిరిరాజ్ అన్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో కలుగజేసుకొని,సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని గిరిరాజ్ అన్నారు. మాయావతి ఒక నేక్డ్ లైవ్ వైర్ అని,ఎవరైతే ఆ వైర్ ని టచ్ చేస్తారో వారు చనిపోతారని గిరిరాజ్ అన్నారు. మూడుసార్లు బీజేపీ ఆమెని సీఎం చేసిందని,కానీ ఆమె మాత్రం తమని నమ్మించి మోసం చేసిందని ఆయన అన్నారు.