డేట్ వేస్తాం : బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయి

  • Published By: venkaiahnaidu ,Published On : January 19, 2019 / 10:33 AM IST
డేట్ వేస్తాం : బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయి

మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల ఐక్యత చాటుతూ  కోల్ కతాలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో మోడీ సర్కార్ తీసుకొంటున్న నిర్ణయాలపై మమత మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని, ఇది అనివార్యమని ఆమె అన్నారు.  బీజేపీకి ఎక్స్ పైరీ డేట్ వచ్చిందన్నారు. ఇది ప్రజల తీర్పు అని ఆమె అన్నారు.  ఇది ఇప్పుడు  కొత్త ఉదయానికి సమయం అని ఆమె అన్నారు.

ఇండిపెండెన్స్ కి ముందు కూడా దేశానికి దారి చూపిన నేల బెంగాల్ అని, వెస్ట్ బెంగాల్ ఎప్పుడూ దారిని లీడ్ చేస్తుందని అన్నారు. మోడీని విమర్శిస్తూ.. ఈ రోజు స్టేజీపై ఉన్న రాజకీయనాయకులందరిని మీరు వదిలిపెట్టనప్పుడు మేమెందుకు మిమ్మల్ని వదిలిపెట్టాలని మోడీని మమత ప్రశ్నించారు.దేశానికి కొత్త వెలుగు తీసుకొచ్చేందుకు తాము కలిసి పనిచేస్తామన్నారు. త్యాగామంటే హిందుత్వం, విశ్వాసం అంటే ముస్లిం, ప్రేమకు చిహ్నామే క్రైస్తవం,  వీరత్వానికి ప్రతిరూపం సిక్కులు, ఇది మన ప్రియ హిందుస్థాన్ అని ఆమె అన్నారు. మారాలి..మారాలి..ఢిల్లీలో సర్కార్ మారాలి అనే నినాదాలతో ప్రతిపక్షాల ఐక్యతా ర్యాలీ విజయవంతంగా ముగిసింది.