కొలువుదీరిన అసెంబ్లీ: 27 మంది కొత్త ఎమ్మెల్యేలు

తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.

  • Published By: sreehari ,Published On : January 17, 2019 / 07:58 AM IST
కొలువుదీరిన అసెంబ్లీ: 27 మంది కొత్త ఎమ్మెల్యేలు

Updated On : January 17, 2019 / 7:58 AM IST

తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి సభకు 27 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 88, కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1, స్వతంత్రులు 2, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఒకరు ఎన్నికయ్యారు. మహిళ సభ్యులు ఆరుగురు ఉన్నారు.

ఇక డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేలుగా హరీశ్ రావు, ముంతాజ్ ఖాన్, ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్యానాయక్ ఎన్నికయ్యారు. ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో మల్లారెడ్డి, బాల్క సుమన్ ఉన్నారు. ఎమ్మెల్సీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. గత శాసనసభలో 76 మంది కొలువుదీరారు.