జగన్‌ను గెలిపించండి: హోదాకు మజ్లీస్ మద్దతు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పదవికి అన్నివిధాలా అర్హుడని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, మోడీ మరికొద్ది రోజుల్లో మాజీ కాబోతున్నారని ఒవైసీ చెప్పారు. అలాగే ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఒవైసీ పునరుద్ఘాటించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ నిబద్ధత లేదని, గోద్రా అల్లర్ల సమయంలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా సాగిందని, ముస్లిం వర్గాన్ని దూరం పెట్టిన బాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ముస్లీంలకు ఇస్తానంటూ కొత్త రాగం అందుకున్నారని అన్నారు.
ఏపీ ప్రజలు చంద్రబాబును నమ్మట్లేదని, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మజ్లీస్ సపోర్ట్ ఉంటుందని అన్నారు. జగన్‌కు ఏపీ ప్రజలు భారీ మెజీరిటీ అందించాలని ఓవైసీ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.