వైఎస్ షర్మిల శవాన్ని మోస్తున్నారు, ఇది చంద్రబాబు కుట్రే- మంత్రి పెద్దిరెడ్డి

వైఎస్ కుటుంబం విడిపోవడానికి, వైసీపీ పార్టీని ఏర్పాటు చేయడానికి మూల కారణం చంద్రబాబే అని కామెంట్ చేశారు.

వైఎస్ షర్మిల శవాన్ని మోస్తున్నారు, ఇది చంద్రబాబు కుట్రే- మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy

Updated On : February 3, 2024 / 6:49 PM IST

Peddireddy Ramachandra Reddy : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ ను జైల్లో పెట్టడానికి, రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం అని ఆయన ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని అన్నారు. ఆ కాంగ్రెస్ శవాన్ని షర్మిల, కేవీపీ, రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు మోస్తున్నారని అన్నారు. ఆ నలుగురికి ఇంకెవరైనా తోడు ఉంటే ఉట్టి పట్టుకునేందుకు ఉంటుందని ఎద్దేవా చేశారు.

Also Read : ఏపీ రాజకీయాలపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఆ ఏరియాల్లో వ్యతిరేకత తప్పదట

కాంగ్రెస్ లో ఉన్న వారంతా వైసీపీలోకి వచ్చేశాము అని మంత్రి చెప్పారు. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఆమెని మేము ప్రతిక్షంగానే చూస్తామని ఇది వరకే స్పష్టం చేశామన్నారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంతవరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. వైసీపీ పార్టీని ఏర్పాటు చేయడానికి మూల కారణం చంద్రబాబే అని కామెంట్ చేశారు.