మంత్రి వర్గ విస్తరణ:ఫిబ్రవరి 10

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సీఎం మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. పదవులుఆశించిన నాయకులు మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అని. చేసే ప్రతి పనికి మంచి చెడులు మహుర్తాలు చూసే కేసీఆర్ ఎట్టకేలకు వసంత పంచమి రోజు కేబినెట్ విస్తరించాలని నిర్ణయించారు.

  • Published By: chvmurthy ,Published On : January 20, 2019 / 02:39 AM IST
మంత్రి వర్గ విస్తరణ:ఫిబ్రవరి 10

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సీఎం మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. పదవులుఆశించిన నాయకులు మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అని. చేసే ప్రతి పనికి మంచి చెడులు మహుర్తాలు చూసే కేసీఆర్ ఎట్టకేలకు వసంత పంచమి రోజు కేబినెట్ విస్తరించాలని నిర్ణయించారు.

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకి ముహూర్తం ఖారారైంది, ఫిబ్రవరి 10, వసంత పంచమి రోజు కేబినెట్ విస్తరించాలని సీఁ కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో  పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుండటం, మంచి ముహూర్తాలు లేకపోవటంతో వసంతపంచమి రోజు కేబినెట్ విస్తరించాలని సీఎం నిర్ణయించుకున్నారు. తొలి విడత విస్తరణలో 8 మందికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల తర్వాత మిగిలిన మంత్రివర్గాన్ని విస్తరిస్తూ మరో 8 మందికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మొదటి విడతలో స్ధానం లభించే 8 మంది ఎవరనే అంశంపై ఇప్పటికే అధికార పార్టీలో ఉహాగానాలు మొదలయ్యాయి. 
ఫిబ్రవరి 10న జరిగే విస్తరణలో అవకాశం లభించే 8 మందిలో కొత్తవారికి ఛాన్స్ ఉండకపోవచ్చని, పాతవారికే ఛాన్స్ లభిస్తుందని కొందరంటుంటే, ఇద్దరైన కొత్తవారుంటారని మరికొందరు అంటున్నారు. మంత్రివర్గంలో అవకాశం రాని వారిని వివిధ కీలక పదవుల్లో నియమించేందుకు కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమయం చిక్కిన్నప్పుడల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ  లిస్టు ముందు పెట్టుకుని ఎవరెవరికి ఏ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు ఆయనతో సన్నిహితంగా ఉండే ఒక మాజీమంత్రి తెలిపారు. 
తొలిదశ మంత్రివర్గ విస్తరణలో అందరూ సీనియర్లే ఉండే అవకాశం ఉంది.  తెలంగాణా ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నేతలకు అవకాశం ఇస్తారని  పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ముఖ్యమంత్రి ఇప్పటి దాకా తీసుకున్న నిర్ణయాలు చూస్తే పాత వారికి తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని ఆశావహులు అంటున్నారు. ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో నలుగురు మినహా మిగతా అందరు సిట్టింగ్ లకు ఆయన టికెట్లు ఇచ్చారు. మహమ్మూద్ ఆలీ, పోచారం శ్రీనివాస రెడ్డిలకు కీలక పదవులు కట్టబెట్టారు. ఇవన్నీచూస్తే సీఎం అందరికీ ఏదోవిధంగా న్యాయం చేస్తారనిపిస్తోందని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత  వివరించారు.