ఉల్లి లొల్లి : జగన్ కి పవన్ సలహాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి పాయల కోసం జనం రైతు బజార్లలో బారులు తీరుతున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ రైతు బజారులో ఒక వృధ్ధుడు ఉల్లిపాయలకోసంక్యూలైన్ లో నిలబడి గుండెపోటు తో మరణించిన సంఘటన కూడా జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉల్లి రేట్లపై ట్లిట్టర్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా జగన్ చేసే మేలు ఉల్లికూడ చేయలేదు కనుక రేట్లు పెంచేశారంటూ వ్యాఖ్యానించారు.
” రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరల నియంత్రించటంలో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు ,కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు, అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా , అని దాని రేటు పెంచేశారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు ,కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు, అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా , అని దాని రేటు పెంచేశారు
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2019
గుడివాడలో ఒక వ్యక్తి ఉల్లిపాయల కోసం క్యూలైన్ లో గుండె ఆగి మరణించటంపై కూడా పవన్ స్పందించారు. గ్రామవాలంటీర్ల ద్వారా ఇళ్ళదగ్గరకే ఉల్లిపాయలు సరఫరా చేయాలని సూచించారు.
మీరు ప్రజలని క్యూలలో నుంచోపెట్టి చంపేకంటే , మీరు నియమించిన గ్రామ వాలంటీర్లను ఉపయోగించి ,ప్రజలు ఇళ్ల దగ్గరికే కిలో 25 రూపాయలకే ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయట్లేదో, Sri Jagan Reddy గారు వివరణ ఇవ్వాలి pic.twitter.com/J726DVYFsy
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2019