నేను దుబాయ్ లో ఉన్నానట : వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆవేశం చూస్తే నవ్వొస్తుంది
తాను దుబాయ్ లో ఉన్నానని, బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నానని వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్

తాను దుబాయ్ లో ఉన్నానని, బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నానని వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్
తాను దుబాయ్ లో ఉన్నానని, బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నానని వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. నేను వెళ్లకున్నా.. సీఎం రమేష్ కొడుకు పెళ్లికి వెళ్లినట్టు ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆవేశం చూస్తే నవ్వొస్తుందని ట్వీట్ చేశారు. 2015లో తాను అమెరికా పర్యటనకు వెళ్లిన పాత ఫొటోలతో కొత్త కథలు అల్లారని లోకేష్ వివరించారు. ”అకౌంట్ లో జగన్ గారి చిల్లర పడితే చాలు.. ఇంగిత జ్ఞానం లేకండా రెచ్చిపోతున్నారు. పోస్ట్ కు రూ.5 ఇస్తున్నారటగా.. కాస్త ఎక్కువ అడగండి.. జే ట్యాక్స్ కోట్లలో వసూలు చేస్తున్నారు.. మీకు మాత్రం రూ.5 వేస్తే ఎలా?” అని అడుగుతూ ట్వీట్ చేశారు లోకేష్.
సీఎం రమేష్ కొడుకు రిత్విక్‌తో పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజా నిశ్చితార్ధం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ వేడుక కోసం దుబాయ్‌లోని వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దేశంలోని పలువురు ఎంపీలతో పాటు అతిరధ మహారధులను ఆహ్వానించారు. టీడీపీతో పాటు వైసీపీ ఎంపీలకూ ఆహ్వానాలు అందాయి. కొంతమంది ప్రముఖులు ముందుగానే దుబాయ్ చేరుకుని సీఎం రమేష్ అతిథ్యంలో మునిగిపోయారు.
సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్ధానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులను ఆహ్వానించారు. ఏపీలోని అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటు ఢిల్లీలో బీజేపీ నేతలను పేరు పేరునా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అతిథులు దుబాయ్ చేరుకోవటానికి ప్రత్యేకంగా 15 విమానాలను ఏర్పాటు చేశారు. అతిథులకు స్వాగతం పలికేందుకు దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్ వరకు తీసుకెళ్లడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. నిశ్చితార్ధం బాధ్యతలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు. కాగా, ఈ నిశ్చితార్థ వేడుక రాజకీయ రంగు పులుముకుంది. పలువురు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ వేదిక ద్వారా బీజేపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
వైకాపా పేటీఎమ్ బ్యాచ్ ఆవేశం చూస్తే నవ్వొస్తుంది. అకౌంట్ లో @ysjagan గారి చిల్లర పడితే చాలు ఇంగిత జ్ఞానం లేకుండా రెచ్చిపోతున్నారు. సీఎం రమేష్ గారి కొడుకు పెళ్లికి లోకేష్ దుబాయ్ వెళ్లాడు అని 2015లో నేను అమెరికా పర్యటనకు వెళ్లిన పాత ఫొటోలతో కొత్త కథ అల్లారు. pic.twitter.com/8LdzM0Dm3f
— Lokesh Nara (@naralokesh) 24 November 2019
ఇంకా పోస్ట్ కి ఐదు రూపాయిలే ఇస్తున్నారటగా కాస్త ఎక్కువ అడగండి స్వామి. జే ట్యాక్స్ కోట్లలో వసూలు చేస్తున్నారు మీకు మాత్రం ఐదు రూపాయిలే వేస్తే ఎలా?
— Lokesh Nara (@naralokesh) 24 November 2019