సీఎల్పీ లీడర్ ఎవరు? సమావేశమైన టీపీసీసీ కోర్  కమిటీ

  • Published By: chvmurthy ,Published On : January 16, 2019 / 03:49 PM IST
సీఎల్పీ లీడర్ ఎవరు? సమావేశమైన టీపీసీసీ కోర్  కమిటీ

హైదరాబాద్‌: గురువారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్ననేపధ్యంలో రేపు ఉదయం సీఎల్పీ  భేటీ జరగనుంది. రేపు జరిగే సీఎల్పీ భేటీలో  ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ ఈరోజురాత్రి గోల్కోండ హోటల్ లో సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ దూత గా హాజరవ్వగా, పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్  చార్జి కుంతియా,  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహా, వీహెచ్,షబ్బీర్ఆలీ, జానారెడ్డి తోపాటు పార్టీ కోర్ కమిటీ సభ్యులు, పలువురు సీనియర్ నాయకులు హజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యనేతల అభిప్రాయాలు వేణుగోపాల్ తీసుకోబోతున్నారు. ఈ సమావేశంలో  పార్టీ ఓటమికి గల కారణాలుకూడా విశ్లేషించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రేపు ఉదయం 9 గంటలకు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి వారి అభిప్రాయాన్నీ తీసుకుని సీఎల్పీ నేతను ఎంపిక చేయనున్నారు. సీఎల్పీ రేసులో  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,  ఎన్నికల సమయంలో రపార్టీ ప్రచార కమిటీ  చైర్మన్ గా పని చేసిన మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ళపాటి శ్రీధర్ బాబుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది.