Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్..! సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించనుందని, రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పదనే ప్రచారం మొదలైంది.

Telangana Lockdown Kcr
Telangana Lockdown : తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించనుందని, రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పదనే ప్రచారం మొదలైంది. దీనిపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతానికి లాక్ డౌన్ అవసరం లేదని అధికారులు నివేదిక ఇచ్చినట్లు కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వైద్యఆరోగ్యశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు కేసీఆర్.
Tea : పిల్లలు టీ తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?
ఒమిక్రాన్ పట్ల భయం వద్దన్న కేసీఆర్ అదే సమయంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. అందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కేసీఆర్ చెప్పారు. కాగా, రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.
వైద్యఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ” కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి. ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలి.
New Year Amazon Deal: రూ.65వేల OnePlus 9Pro 5G ఫోన్ 30వేలకే!
ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలి” అని కేసీఆర్ చెప్పారు.
సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను సీఎంకు వివరించారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సీఎంకు నివేదిక ఇచ్చారు.
మరోవైపు తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. జనవరి చివరి వారంలో ఆ రెండింటిలో ఏదో ఒక నిర్ణయం ఉండవచ్చని తెలిపారు. వైరస్ కట్టడికి ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని శ్రీనివాసరావు సూచించారు. అలాగే, అర్హులంతా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.