CM KCR On Floods : దొంగలు తయారయ్యారు.. అటవీశాఖ అధికారులపై సీఎం కేసీఆర్ సీరియస్
‘‘ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అంటూ అటవీ శాఖ అధికారులపై నిప్పులు చెరిగారు కేసీఆర్.(CM KCR On Floods)

Cm Kcr
CM KCR On Floods : ఏటూరు నాగారంలోని ఐటీడీఏలో వరద సహాయక చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమీక్షలో అటవీశాఖ అధికారులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు డీఎఫ్ఓ(డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్) ప్రదీప్ కుమార్ ను మందలించారు. శ్యాంపల్లిలో బ్రిడ్జి నిర్మాణం అడ్డుకోవడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. అటవీ ప్రాంతంలో రోడ్డు వేయొద్దు అంటే ఎలా అని నిలదీశారు. రోడ్డు వేయకపోతే గిరిజనులకు రేషన్ ఎలా అందుతుందని కేసీఆర్ ప్రశ్నించారు.
భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం కేసీఆర్.. గోదావరి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం ఏటూరునాగారంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖలో దొంగలు తయారయ్యారన్న కేసీఆర్.. అన్నీ అమ్ముకుదొబ్బారని మండిపడ్డారు. ములుగు ప్రాంతంలో ఒక్క చెట్టయినా ఉందా..? అని ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి పనులకు ఇబ్బందులు కలిగించొద్దని సీఎం సూచించారు.(CM KCR On Floods)
CM KCR : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆకస్మిక వరదల వెనుక విదేశీ కుట్రలు
ఈ సందర్భంగా ములుగు డీఎఫ్ఓ ప్రదీప్ కుమార్ ని మందలించారు కేసీఆర్. అటవీ ప్రాంతంలో రోడ్డు వేయనీయం, వంతెన కట్టనీయం.. కరెంట్ స్తంభాలు వేయనీయం.. అన్నట్టుగా అటవీ శాఖ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. శ్యాంపల్లి వంతెన నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో.. రేషన్ ఇవ్వలేకపోతున్నామని.. కలెక్టర్, ప్రజలు చావాలా..? అని డీఎఫ్ఓను కేసీఆర్ నిలదీశారు. వెరీ సారీ.. మంచి పద్ధతి కాదంటూ అటవీ శాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.
ఏటూరునాగారం, రామన్నగూడెంలో వరద ముంపు ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. రామన్నగూడెం ప్రాంతానికి వచ్చే ఏడాది నుంచి గోదావరి వరద బెడద లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ.. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు.
Cloudburst : సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన క్లౌడ్ బరస్ట్ అంటే …..
ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ములుగు జిల్లా కేంద్రానికి ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగులో ఒక హెలికాప్టర్, భద్రాచలంలో మరో హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. భారీ వర్షాలు కురిసినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రతి శాఖ అధికారులు 3 షిఫ్టులుగా పనిచేసి లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సూచించారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని, ఎన్ని నిధులు ఖర్చయినా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదలశాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్ రూపొందించాలని సూచించారు. చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్న మిషన్ భగీరథ పైపులకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.
తక్షణ వరద సాయం కింద వివిధ జిల్లాలకు నిధులు మంజూరు చేశారు కేసీఆర్. ములుగు జిల్లాకు రూ.2.50కోట్లు, భద్రాచలం జిల్లాకు రూ.2.30కోట్లు, భూపాలపల్లి జిల్లాకు రూ.2కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.50కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్‌వేలు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సౌకర్యాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.(CM KCR On Floods)
వరద వచ్చినప్పుడల్లా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తిరిగే పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కడెం ప్రాజెక్టుకు ఏనాడు రాని రీతిలో 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టును దేవుడే కాపాడినట్టుగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలకు చెందిన వారు మన దేశంలో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉందన్నారు.
గతంలో కశ్మీర్ లోని లద్దాఖ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ప్రస్తుతం గోదావరిపై క్లోడ్ బరస్ట్ చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. ఆకస్మిక వరదల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందని చెబుతున్నారని, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆకస్మిక వరదల వెనుక విదేశాల కుట్ర ఉండొచ్చు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఏటూరునాగారంలో ఈ మధ్యాహ్నం మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం శ్రీ కేసీఆర్ పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి తల్లికి ముఖ్యమంత్రి సారె సమర్పించి, శాంతి పూజలు నిర్వహించారు. #GodavariFloods pic.twitter.com/ACW8eXQlAB
— Telangana CMO (@TelanganaCMO) July 17, 2022