Bandi Sanjay : కిషన్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం : బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ తప్ప... బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. ఒవైసీ చెబితే.. సమైక్యత దినోత్సవం జరుపుతున్నారని పేర్కొన్నారు.

MP Bandi Sanjay
Bandi Sanjay – BRS : కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికల హామీని నెరవేర్చాలని కిషన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పదవి విరమణ పొందిన అధికారులకు లక్షలు ఇచ్చి సీఎంవో ఆఫీస్ లో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులను బెదిరించడానికి అధికారులను పెట్టుకున్నారని విమర్శించారు.
తెలంగాణలో మంత్రులంతా డమ్మీ అయ్యారని, అడ్వైజర్ల హవా నడుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎలా తీరుస్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్ లేపుతున్నారని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కాని హామిలిస్తున్న కాంగ్రెస్ పార్టీని చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు 20 సీట్లకు మించి రావు- బండి సంజయ్ జోస్యం
తెలంగాణలో బీజేపీ తప్ప బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. ఒవైసీ చెబితే.. సమైక్యత దినోత్సవం జరుపుతున్నారని పేర్కొన్నారు. వేర్వేరు ఎన్నికలు వస్తే తాను కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఇప్పటికే కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల పని మొదలు పెట్టానని తెలిపారు.