Rains : తెలంగాణాలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
గత కొద్ది రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపింది.

Rains In Telangana
Rains : గత కొద్ది రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపింది. కర్ణాటక ,తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని… ఈనెల 25 వరకు దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : Hyderabad : మల్కాజ్‌గిరి మహిళ హత్య కేసులో నిందితులు ఎవరు ?
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.