Night Curfew Extended : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మే 15 వరకు పొడిగింపు

తెలంగాణలో నైట్ క‌ర్ఫ్యూను మ‌రో వారం రోజుల పాటు పొడిగించారు. నైట్ కర్ఫ్యూ ఈ నెల 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Night Curfew Extended : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మే 15 వరకు పొడిగింపు

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మే 15 వరకు పొడిగింపు

Updated On : May 7, 2021 / 6:59 PM IST

Night curfew extended in Telangana : తెలంగాణలో నైట్ క‌ర్ఫ్యూను మ‌రో వారం రోజుల పాటు పొడిగించారు. నైట్ కర్ఫ్యూ ఈ నెల 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 15వ తేదీ ఉద‌యం 5 గంట‌ల‌ వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది.

మొద‌ట్లో 8వ తేదీ వ‌ర‌కు క‌ర్ఫ్యూని పొడిగించిన ప్ర‌భుత్వం తాజాగా మ‌రోవారం పాటు పొడిగించింది. పెళ్లిళ్ల‌కు 100 మందికి మించి హాజ‌రుకారాదని తెలిపింది. అంత్య‌క్రియ‌ల్లో 20 మందికి మించి పాల్గొన‌రాద‌ని సూచించింది.

సామాజిక‌, రాజ‌కీయ‌, క్రీడా, వినోద, విద్య‌, మ‌త‌, సాంస్కృతిక‌ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ప్ర‌జ‌లు భౌతిక‌దూరం పాటించ‌డం, మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధరించాలని పేర్కొంది.