CM KCR : ఒమిక్రాన్‌కు భయపడొద్దు.. అలాగని అజాగ్రత్త వద్దు.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి. ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలి.

Cm Kcr Omicron
CM KCR : తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో వైద్యఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. కాగా, ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేసీఆర్.. అదే సమయంలో ప్రజల్లో అజాగ్రత్త పనికిరాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు.
వైద్యఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ” కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి. ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలి.
Tea : పిల్లలు టీ తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?
ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలి” అని కేసీఆర్ చెప్పారు.
సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను సీఎంకు వివరించారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సీఎంకు నివేదిక ఇచ్చారు.
”రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారు. మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలి. గతంలో రాష్ట్రంలో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగాం. ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలి” అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Fenugreek Seeds : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గించే మెంతులు
అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు కేసీఆర్. ఏ కారణంతోనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు:
కాగా, తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. కొన్నిరోజుల కిందటి వరకు 100కి అటూఇటూగా నమోదైన కొత్త కేసులు, ఇప్పుడు 400 దాటాయి. గడచిన 24 గంటల్లో 38,362 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 482 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 55, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 212 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,971 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,74,892 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,048కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 4,031కి పెరిగింది.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు కేసీఆర్. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్టా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు కేసీఆర్.