Kishan Reddy: మీడియా సంస్థలపై నిషేధం విధించిన వారు.. నీతులు చెప్పడమా?: కిషన్ రెడ్డి

తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ వివిధ మీడియా సంస్థలపై నిషేధం విధించి ముప్పుతిప్పలు పెట్టిన కల్వకుంట్ల కుటుంబం.. పత్రికా స్వేచ్ఛ విషయంలో తమకు నీతులు బోధించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీబీసీ సంస్థపై ఐటీ దాడులపై బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు.

Kishan Reddy: మీడియా సంస్థలపై నిషేధం విధించిన వారు.. నీతులు చెప్పడమా?: కిషన్ రెడ్డి

Updated On : February 16, 2023 / 8:42 PM IST

Kishan Reddy: తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ వివిధ మీడియా సంస్థలపై నిషేధం విధించి ముప్పుతిప్పలు పెట్టిన కల్వకుంట్ల కుటుంబం.. పత్రికా స్వేచ్ఛ విషయంలో తమకు నీతులు బోధించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీబీసీ సంస్థపై ఐటీ దాడులపై బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు.

ఢిల్లీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రికాస్వేచ్ఛను కాలరాసిన కల్వకుంట్ల కుటుంబం చేసే పనులు, వారి వ్యవహార శైలి ఎలాంటిదో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మీడియా సంస్థలపై దాడులు చేయడం లేదని.. అది బీఆర్ఎస్ పార్టీకి అలవాటైన పని అని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కుటుంబం పత్రికాస్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మీడియా సంస్థలను గొయ్యితీసి కిలోమీటర్ల లోపల తొక్కుతా అన్నదెవరు? అని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో తాము లేమని చెప్పారు. బీబీసీపై ఐటీ దాడులు చేయాల్సిన రాజకీయ అవసరం తమకు లేదని కిషన్ రెడ్డి అన్నారు.

Nirmala Sitharaman: అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్