Weather Updates: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్… పిడుగులు పడే ప్రమాదం..
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

AP Rains Alert
Weather Updates: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల 3 గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. చెట్ల కింద నిలబడరాదన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Also Read: ఏపీలోని పేద, మధ్య తరగతి ప్రజలకు గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే