జోయా సోలంకి : ది మోడరన్ మాత

సోనమ్ కపూర్, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ది జోయా ఫ్యాక్టర్'.. ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 29, 2019 / 09:46 AM IST
జోయా సోలంకి : ది మోడరన్ మాత

సోనమ్ కపూర్, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది జోయా ఫ్యాక్టర్’.. ట్రైలర్ రిలీజ్..

డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పిస్తున్న బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ మరో వైవిధ్య భరితమైన క్యారెక్టర్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. సోనమ్‌తో పాటు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ది జోయా ఫ్యాక్టర్’.. అభిషేక్ శర్మ దర్శకత్వంలో, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, యాడ్-ల్యాబ్స్ ఫిలింస్ లిమిటెడ్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

అనూజ చౌహాన్ రాసిన ‘ది జోయా ఫ్యాక్టర్’ నవల ఆధారంగా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు. 1983 జూన్ 25న కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో జోయా సోలంకి పుడుతుంది. ఇక అప్పటినుండి ఆమె అదృష్ట దేవత అయిపోతుంది.

Read Also : ఖాలీ పీలీ – ఫస్ట్ లుక్..

లక్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన సోలంకిని ప్రజలు మోడరన్ మాతగా కొలుస్తారు. ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆమె లక్కీ చార్మ్‌గా మారిపోతుంది. తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి అనే ఆసక్తికర అంశాలతో రూపొందిన ది జోయా ఫ్యాక్టర్ సెప్టెంబర్ 20న రిలీజవనుంది.