Horrifying video: నడిరోడ్డుపై కారును వెంబడించి, ఆపి కలకలం సృష్టించిన గూండాలు

బైకులను కారు ముందుకు తీసుకువచ్చి మెల్లిగా పోనిస్తారు.

Horrifying video: నడిరోడ్డుపై కారును వెంబడించి, ఆపి కలకలం సృష్టించిన గూండాలు

Horrifying video

Updated On : July 17, 2023 / 8:16 PM IST

Horrifying video – Crime: కొందరు గూండాలు ఓ కారును వెంబడించి కలకలం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ గూండాలను అరెస్టు చేశామని పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు(Bengaluru)లో ఈ ఘటన చోటుచేసుకుంది.

కారులో ఓ వ్యక్తి వెళ్తుండగా కొందరు గూండాలు ఆ కారును వెంబడిస్తారు. బైకులను కారు ముందుకు తీసుకువచ్చి మెల్లిగా పోనిస్తారు. చివరకు కారుకు అడ్డంగా బైకులకు ఆపుతారు. అనంతరం కారులోని వ్యక్తి వద్దకు ఆ గూండాలు రాబోతారు.

దీంతో కారులోని వ్యక్తి భయాందోళనలకు గురై కారును రివర్స్ గేర్ లో వెనకకు తీసుకెళ్తాడు. ఈ దృశ్యాలు కారు డాష్‌క్యామ్ లో రికార్డయ్యాయి. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేశాడు ఓ నెటిజన్. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? అని అడిగాడు.

దీంతో పోలీసులు స్పందిస్తూ… కారును వెంబడించిన గూండాలను అరెస్టు చేశామని చెబుతూ వారి ఫొటోలను పోస్ట్ చేశారు. అనుచిత చర్యలను తాము ఉపేక్షించబోమని అన్నారు. ఇటువంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే #Namma112కు సమాచారం అందించాలని చెప్పారు.

United Nation: హిందీ భాష విస్తృతి కోసం ఐక్యరాజ్య సమితికి రూ.8 కోట్లు ఇచ్చిన భారత్