Lok Sabha elections 2024: అందుకే మేమందరం ఏకమయ్యాం: మల్లికార్జున ఖర్గే

ఎన్డీయేలో చేరేందుకు నిరాకరించడంతో ఆయనను కటకటాల వెనక్కి నెట్టారని అన్నారు.

Lok Sabha elections 2024: అందుకే మేమందరం ఏకమయ్యాం: మల్లికార్జున ఖర్గే

mallikarjun kharge

ఇండియా కూటమి భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని సూచిస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ ప్రయోజనాల కోసం కూటమి భాగస్వాముల మధ్య ఐక్యత అవసరమని తెలిపారు. మోదీ నియంతృత్వాన్ని విశ్వసిస్తున్నారని, ప్రజాస్వామ్యన్ని కాదని చెప్పారు. BJP/RSS విషం లాంటిదని చెప్పారు.

వాటికి మద్దతు తెలపడం ప్రాణాంతకం అవుతుందని అన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం కూటమి భాగస్వాములు కలిసి పోరాడాలని చెప్పారు. కూటమి భాగస్వామ్య పక్షాలకు స్థానికంగానూ, రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని విభేదాలు ఉన్నా జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో అన్ని పక్షాలు కలిసి ఉండాలని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు.

బీజేపీ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని చెప్పారు. ప్రత్యర్థి పార్టీలను బెదిరించడంతోపాటు కొన్ని పార్టీలను బీజేపీ పొత్తులోకి తీసుకోవడానికి మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపర్చుతున్నారని అన్నారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్డీయేలో చేరేందుకు నిరాకరించడంతో ఆయనను కటకటాల వెనక్కి నెట్టారని అన్నారు.

ఇప్పుడు నీటి ట్యాంకర్ల వ్యాపారం నడుస్తోంది: సూర్యాపేటలో కేసీఆర్ ఫైర్