PM Modi: ‘ఎవర్నీ వదిలిపెట్టం.. భారీ మూల్యం చెల్లించుకుంటారు..’ పహల్గాం ఘటనపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్..
మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Pm modi
PM Modi: పహల్గాం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఓ బహిరంగ వేదికపై స్పందించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బిహార్ లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతోపాటు సభలో పాల్గొన్నవారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు.
మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయింది.. ఓ సోదరి జీవిత భాగస్వామిని కోల్పోయింది. ఇది కేవలం పర్యటకులకుపై జరిగిన దాడి మాత్రమే కాదు. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసం అని మోదీ అన్నారు.
Also Read: Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. భారత్ లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నవారు.. కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విదిస్తాం అని మోదీ హెచ్చరించారు. పర్యటకులపై కాల్పులు జరిపిన ప్రతి ఉగ్రవాదిని గుర్తించి శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇస్తున్నాం.. అంటూ మోదీ పేర్కొన్నారు.