Jogi Ramesh : నీకు దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా 175 స్థానాల్లో పోటీ చేయ్- పవన్ కల్యాణ్‌కి మంత్రి జోగి రమేశ్ సవాల్

Jogi Ramesh : అందరినీ చంద్రబాబు దొడ్డిలో కట్టేస్తామంటే మోసం చేసినట్లు కాదా? 2024 లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎమ్మెల్యేగా గెలవడం కోసం..

Jogi Ramesh : నీకు దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా 175 స్థానాల్లో పోటీ చేయ్- పవన్ కల్యాణ్‌కి మంత్రి జోగి రమేశ్ సవాల్

Jogi Ramesh

Updated On : May 12, 2023 / 6:14 PM IST

Jogi Ramesh-Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తన అజెండా అని, అందుకోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని, తాను సీఎం పదవి కోసం డిమాండ్ చేయనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పొత్తుల గురించి పవన్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. పవన్ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో కలవరం నింపగా, టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. పవన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు స్వాగతిస్తే.. వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

మంత్రి జోగి రమేశ్.. పవన్ పై ఫైర్ అయ్యారు. పూజకు పనికి రాని పువ్వు పాలకుడు కాదన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు పాలేరని మొదటి నుంచి తాము చెబుతూనే ఉన్నామన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. పవన్ చీఫ్ మినిస్టర్ కాదు కదా చీప్ క్యారెక్టర్ అని విమర్శించారు. పవన్ ఎమ్మెల్యేగానే ముద్ర వేయలేకపోయారు, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఎమ్మెల్యేగా గెలవడం కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకుంటున్నారు అని విమర్శలు చేశారు.(Jogi Ramesh)

Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

”సీఎం సీఎం అని నమ్మకం పెట్టుకున్న నీ అభిమానులను మోసం చేయడం కాదా? నీకు దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్ గా పోటీ చేసి రాజకీయ నాయకుడిగా ప్రజలకు చెప్పు. అందరినీ చంద్రబాబు దొడ్డిలో కట్టేస్తామంటే మోసం చేసినట్లు కాదా? ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా మాకు నష్టం లేదు.
2019 ఎన్నికల్లో ఏ విధంగా విజయ దుంధుబి మోగించామో, 2024 లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఒక మంచి ఆలోచనలతో జీవో నెంబర్ 1 తీసుకొచ్చాం.

Also Read..Andhra Pradesh: జీవో నంబరు 1ని కొట్టేసిన ఏపీ హైకోర్టు.. ఆ జీవోపై ఏమందంటే?

సందుల్లో చంద్రబాబు సభలు పెట్టడం ద్వారా ప్రజలు చనిపోతున్నారు. గ్రౌండ్ లో పెట్టుకుంటే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి? మంచి తలపెడితే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం ఏంటి? జీవో నెంబర్ 1పై స్టే తీసుకొస్తే మీకేంటి ఉపయోగం? రోడ్లపై సభలు పెట్టడం ద్వారా ప్రజల ప్రాణాలు పోతే ఆ ప్రాణాలు తిరిగి తేగలమా? జీవో నెంబర్ 1పై సుప్రీం కోర్టుకు వెళతాం” అని మంత్రి జోగి రమేశ్ అన్నారు.(Jogi Ramesh)

పొత్తులు, సీఎం పదవిపై అసలు పవన్ ఏమన్నారంటే..
”నాకు పదవులు ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మొదటి నుంచి దానికే కట్టుబడి ఉన్నా. ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్ చేయను. సీఎం పదవి కోసం తాపత్రయ పడకూడదు. సీఎం పదవి అనేది వరించి రావాలి తప్ప, కోరుకుంటే వచ్చేది కాదు. మన కష్టం మీదే ముఖ్యమంత్రి పదవి మనల్ని వరించాలి తప్ప మనం ఆ పదవి కోసం పాకులాడకూడదు. పొత్తుల్లో సీఎం అభ్యర్థి కండీషన్ ఉండదు. రాష్ట్ర భవిష్యత్తు కండీషన్ మాత్రమే ఉంటుంది.

కండీషన్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి పొందలేము. నా పార్టీ బలం ఏంటో నాకు తెలుసు. అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాటకే కట్టుబడి ఉన్నా. పొత్తులతో ముందుకెళతాం” అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.(Jogi Ramesh)